: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు


మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు ఇప్పటివరకు సుమారు 20 లక్షల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. జంపన్న వాగులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.ఈరోజు సాయంత్రం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి రూపంలో ఉండే కుంకుమ భరిణెను తీసుకువచ్చే క్షణాల కోసం లక్షలాది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మేడారం జాతరకు హన్మకొండ నుంచి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. హయగ్రీవాచారి మైదానం నుంచి ఈ బస్సు సర్వీసును ఆర్టీసీ జేఎండీ ప్రారంభించారు. ప్రతి గంటకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ సౌకర్యం భక్తులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News