: చిలకలూరిపేట అంటే మజాకా కాదు: చంద్రబాబు
రాజధాని అమరావతి నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పెద్ద పట్టణాల్లో ఒకటిగా చిలకలూరిపేటకు ఉజ్వల భవిష్యత్ ఉందని, దేశంలోనే అత్యంత ప్రధాన రహదారుల్లో ఒకటైన కోల్ కతా, చెన్నై రహదారిపై ఉండటం పట్టణానికి అత్యంత లాభదాయకమని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం నగరంలో జరిగిన స్వచ్ఛ చిలకలూరిపేట కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలసి పాల్గొన్న ఆయన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువని వ్యాఖ్యానించిన ఆయన, చిలకలూరిపేట అంటే మజాకా కాదని చెప్పి, సభలో నవ్వులు పూయించారు. మోదీ సర్కారు సహకారంతో పట్టణంలో రూ. 500 కోట్లతో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టినట్టు వివరించారు.