: యూపీ అభ్యర్థి హాల్ టికెట్ పై సచిన్ తనయుడి ఫోటో!


సాధారణంగా ఓటర్ కార్డులు, ఆధార్ కార్డుల్లో చోటుచేసుకునే ఓ విచిత్రం ఇప్పుడు యూపీలోని ఇంటర్ పరీక్షల్లో చోటుచేసుకుంది. నేటి నుంచి ఉత్తరప్రదేశ్ లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో లక్షన్నర మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. వారిలో అర్జున్ సింగ్ అనే బాలుడు కూడా ఉన్నాడు. హాల్ టికెట్ తీసుకున్న అర్జున్ సింగ్ షాక్ అయ్యాడు. తన ఫోటో స్థానంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఫోటో ఉండడం చూసి అవాక్కయ్యాడు. దీంతో అధికారులు విద్యాశాఖాధికారులకు సమాచారం అందించారు. దీనిపై వారు మండిపడ్డారు. ఎలాంటి తప్పు జరగకుండా పరీక్షలు నిర్వహిద్దామంటే ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కళాశాల పొరపాటు కూడా ఉందని, విద్యార్థి ఫోటోను పరిశీలించకుండా సంతకాలు ఎలా చేశారని వారు ప్రశ్నించారు. దీనిపై ప్రత్యేక కమిటీ దర్యాప్తు జరుపుతుందని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News