: సుప్రీంకోర్టులో కన్నయ్య కుమార్ బెయిలు పిటిషన్... రేపు విచారణ


జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అతని తరపున న్యాయవాది వృందా గ్రోవర్ పిటిషన్ ను సమర్పించారు. పాటియాల హౌస్ కోర్టులో పిటిషన్ వేసే పరిస్థితులు లేనందునే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు న్యాయవాది తెలిపారు. ఆర్టికల్ 32 కింద బెయిల్ కోసం కన్నయ్య పిటిషన్ వేశారని చెప్పారు. జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను స్వీకరించి, రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. కాగా, కన్నయ్య బెయిల్ పిటిషన్ వేసుకుంటే తాము అడ్డుకోమని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ నిన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సుప్రీంకు వెళ్లారు. దేశద్రోహం కేసులో అరెస్టైన కన్నయ్యకు నిన్న(బుధవారం) పాటియాల హౌస్ కోర్టు మార్చి 2వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News