: ఆ ఊరి వాళ్లకి పొద్దున్నే 'గడ్డి' పని...ఆ తర్వాతే అసలు పని!


ఆ ఊర్లో వాళ్లకి ఎవరితోనూ ఇబ్బంది లేదు కానీ, 'గడ్డి'తో మాత్రం మహా చిక్కొచ్చిపడిపోయింది. పొద్దున్నే లేచి చూసేసరికి వరద నీరు ముంచెత్తినట్టుగా, ఊరంతటినీ గడ్డి ముంచెత్తుతుంది. తమాషాగా ఉంది కదూ... ఆ వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియాలోని వరంగరట్టా అనే చిన్నపట్టణంలో బూరుగడ్డి పెరుగుతుంది. ఈ గడ్డి సాధారణంగా పెరిగితే అక్కడి వారికి ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కానీ ఇది అసాధారణంగా పెరుగుతుంది. రాత్రి పడుకుని తెల్లారి లేచే సరికి ఊరిని ముంచేసేలా పెరిగిపోతుంది. ముందుగా ఆ గడ్డిని కత్తిరిస్తే కానీ ఏ పనీ చేసుకోలేరు. దీనిని కత్తిరించేందుకు ప్రతి ఇంటికి మెషీన్లుంటాయి. దీంతో తెల్లవారి లేస్తూనే ఆ ఊరి వాళ్లు ముందుగా ఈ గడ్డి కత్తిరింపు పనిని నెత్తికెత్తుకుంటారు. ఆ తర్వాతే వాళ్లకి రోజు మొదలవుతుంది. అచ్చం ఆస్ట్రేలియన్ల జుట్టులా బంగారు రంగులో ఉండే ఈ గడ్డి సమస్యను 'హెయిర్ పానిక్' అని పిలుస్తారు. ఈ గడ్డి పశువులకు ప్రమాదకరం, ఇవి తిన్న పశువులు, మేకలు మరణిస్తాయి. ఈ గడ్డిలో ఒకరకమైన విషపదార్థం ఉంటుంది. ఈ గడ్డి ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్నప్పటికీ ఈ పట్టణంలో మాత్రం ప్రమాదకరంగా పెరుగుతుంది.

  • Loading...

More Telugu News