: సిగ్గులేనిదీ కాంగ్రెస్ ప్రభుత్వం: బాబు
కాంగ్రెస్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ కరవైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిర్భయ హంతకులను బహిరంగంగా ఉరితీసి ఉంటే దేశంలో ఇలాంటి దురాగతాలకు పాల్పడాలంటే భయపడేవారని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా? అని బాబు ప్రశ్నించారు. కఠిన శిక్షలతోనే ఇలాంటి కిరాతకాలకు అడ్డుకట్ట వేయవచ్చని బాబు సూచించారు. ప్రస్తుతం బాబు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. బాబు పాదయాత్ర ఎల్లుండితో ముగియనుంది. ఆ రోజున విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఈ సభకు వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం పది ప్రత్యేక రైళ్ళను నడపనున్నారు.