: విద్యార్థులు తరగతి గదులకు తుపాకులు తీసుకెళ్లేందుకు అనుమతి!


ఆమధ్య అమెరికాలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కాల్పులకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు వ్యక్తిగత రక్షణగా తమ వెంట తుపాకులు తీసుకెళ్లేందుకు అనుమతి కల్పించారు. తాజాగా అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులు సైతం తరగతి గదుల్లోకి వెళ్లేటప్పుడు తమవెంట తుపాకులు తీసుకెళ్లేందుకు అనుమతి కల్పించడం ఆసక్తి కలిగిస్తోంది. కొన్ని నెలల కిందట అక్కడి శాసనసభ్యులు తరగతి గదులకు తుపాకులను తీసుకెళ్లవచ్చంటూ నూతన చట్టానికి ఆమోదం తెలిపారు. దాంతో విద్యార్థులందరూ తుపాకులను వెంట తెచ్చుకోవడంతో వర్సిటీ అనుమతించక తప్పలేదు. అయితే విద్యార్థుల వద్ద తుపాకులు ఉంటే వాటితో ఉపాధ్యాయులను బెదిరించే అవకాశం లేకపోలేదని వర్సిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News