: హఫీజ్ సయీద్ పేరిట ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న ఐఎస్ఐ!
దేశ యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాది హఫీజ్ సయీద్ పేరిట ఒక ట్విట్టర్ ఖాతాను ఐఎస్ఐ తెరిచినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలోని యువతకు వల వేసి వారిని పెడదోవ పట్టించేందుకు ఈ ట్విట్టర్ ఖాతాను వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో దానికి అడ్డుకట్టవేసేందుకు సయీద్ కు సంబంధించిన ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలను నిలిపివేయాలని ఆయా సంస్థలను నిఘా వర్గాలు కోరనున్నట్లు తెలుస్తోంది.