: 'పాటియాల హౌస్ కోర్టు' ఘటనపై సుప్రీంకోర్టు విచారం


ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు వద్ద రెండు వర్గాల న్యాయవాదులకు మధ్య జరిగిన ఘర్షణ, జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ పై దాడి పట్ల సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆ ఘటనపై విచారణ జరపనుంది. మరోవైపు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. జర్నలిస్టులపై న్యాయవాదులు చేసిన దాడికి క్షమాపణ చెప్పింది. కోర్టు ప్రాంగణంలోనే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని బార్ కౌన్సిల్ ఛైర్మన్ అన్నారు. ఘటనపై ముగ్గురు సభ్యుల బృందం విచారణ చేస్తోందని, న్యాయవాదులది తప్పని తేలితే వారి లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News