: నెట్ వరల్డ్ లో సరికొత్త రికార్డు... సెకనుకు ఆరు లక్షల హిట్లు... 24 గంటల సమయం ఇవ్వండి: ఫ్రీడమ్ 251


ప్రపంచంలోనే అత్యంత చౌకధరకు స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రారంభించిన రింగింగ్ బెల్స్, వెబ్ సైట్ వైఫల్యాలపై స్పందించింది. ఈ ఉదయం 6 గంటల నుంచి ఫ్రీడమ్ 251 బుకింగ్స్ మొదలుకావాల్సి ఉండగా, ఎవరికీ బుకింగ్ సైట్ ఓపెన్ కాని సంగతి తెలిసిందే. దీనిపై సంస్థ ప్రతినిధులు వెబ్ సైట్లో ఓ ప్రకటన ఉంచారు. ఉదయం 6 గంటల నుంచి సరాసరిన సెకనుకు 6 లక్షల హిట్లు వచ్చాయని, సర్వర్ కు అంత సామర్థ్యం లేకపోవడంతోనే బుకింగ్స్ తీసుకోలేకపోయామని, అందుకు మన్నించాలని కోరింది. సర్వర్ ను అప్ డేట్ చేసే పనిలో ఉన్నామని, అందుకు 24 గంటల వరకూ సమయం పట్టవచ్చని తెలిపింది. సాధ్యమైనంత త్వరలో సేవలను పునరుద్ధరిస్తామని వివరించింది. కాగా, కనీసం రెండు గంటల పాటు సెకనుకు 6 లక్షల హిట్స్ రావడం ప్రపంచ నెట్ చరిత్రలో ఇదే మొదటిసారని తెలుస్తోంది. గతంలో ఈ-కామర్స్ మాధ్యమాల్లో ఫ్లాష్ సేల్స్ ప్రకటించినప్పుడు, టీటీడీ ఆన్ లైన్ సేవా టిక్కెట్లు, పండగ సీజన్ లో రైల్వే టికెట్లు, పది, ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజుల్లో పలు వెబ్ సైట్లకు 5 నుంచి 7 లక్షల హిట్స్ వచ్చినప్పటికీ, ఆ స్థాయి వెబ్ ట్రాఫిక్ కొన్ని నిమిషాలపాటే కొనసాగేది.

  • Loading...

More Telugu News