: చెన్నై సిటీ బస్సుల్లో సీనియర్ సిటిజన్ లకు ఉచిత ప్రయాణం
తమిళనాడు సీనియర్ సిటిజన్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. చెన్నై సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ సౌకర్యం వర్తించనుందని సీఎం జయలలిత స్వయంగా ప్రకటించారు. తొలివిడతగా ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుందని, ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని తెలిపారు. నెలలో పదిసార్లు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు చెప్పారు.