: శారదా పీఠం మహా కుంభాభిషేక పూజల్లో పాల్గొన్న జగన్


విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ ఈ రోజు హాజరయ్యారు. ఇవాళ పీఠం ముగింపు వార్షికోత్సవాల కార్యక్రమంలో భాగంగా శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో తెల్లని వస్త్రాలు ధరించి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పూజలు నిర్వహించారు. అనంతరం మహా కుంభాభిషేక విశేషాన్ని స్వరూపానందేంద్ర జగన్ కు వివరించారు. గతేడాది జనవరిలో జరిగిన శారదా పీఠం వార్షికోత్సవాల్లో కూడా జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News