: డొనాల్డ్ ట్రంప్ చుట్టూ కష్టాలు... ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్లిన టెడ్ క్రూజ్


వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, తాత్కాలికంగా ప్రయోజనం ఉండవచ్చుగానీ, దీర్ఘకాలంలో నష్టమేనని రిపబ్లికన్ల తరఫున అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు క్రమంగా తెలిసొస్తోంది. తాజాగా అమెరికాలో వాల్ స్ట్రీట్ జర్నల్ / ఎన్బీసీ సంయుక్తంగా నిర్వహించిన పోల్ లో, అధ్యక్ష పదవికి ట్రంప్ కన్నా టెడ్ క్రూజ్ సరైన వ్యక్తని అమెరికన్లు భావిస్తున్నారని తేలింది. ఈ పోల్ ఫలితాలను విడుదల చేయగా, క్రూజ్ కు అనుకూలంగా 28 శాతం మంది, ట్రంప్ కు అనుకూలంగా 26 శాతం మంది ఉన్నట్టు వెల్లడైంది. వాస్తవానికి ఎన్నికల హడావుడి మొదలైన సమయంలో తన ప్రత్యర్థుల కన్నా డొనాల్డ్ ట్రంప్ 10 శాతం కన్నా అధిక లీడ్ లో ఉన్నారు. ఆయనే రిపబ్లికన్ల తరఫు అభ్యర్థని అత్యధికులు భావించారు కూడా. కానీ పరిస్థితి నెమ్మదిగా మారుతున్నట్టు ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక జరుగుతున్న నష్టాన్ని నివారించి తిరిగి ముందంజలోకి రావడానికి ట్రంప్ ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచిచూడాలి!

  • Loading...

More Telugu News