: జగన్ ది మేకపోతు గాంభీర్యం... రాష్ట్రంలో అశాంతికి ఆయనే కారణం: సోమిరెడ్డి ఆరోపణ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోమారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాసేపటి క్రితం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో నెలకొన్న అశాంతికి జగనే కారణమని ఆయన ఆరోపించారు. ‘‘జగన్ ది మేకపోతు గాంభీర్యం. దమ్ముంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలి. ఎన్నికలకు ముందే జగన్ జైలుకెళ్లడం ఖాయం. రాయలసీమ తాగు, సాగు నీటి కష్టాలను తీర్చనున్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’’ అని సోమిరెడ్డి అన్నారు.