: నుపూర్...నీ గొంతు నరాలు తెగ్గోస్తారు!: బీజేపీ మహిళా నేతకు బెదిరింపులు


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న వరుస ఉద్రిక్త పరిస్థితులు రాజకీయ నేతల మెడకు చుట్టుకుంటున్నాయి. భారత పార్లమెంటుపై దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా జరిగిన ర్యాలీతో అక్కడ పెను వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ర్యాలీ తీసిన విద్యార్థులకు వ్యతిరేకంగా ఏబీవీపీ, అనుకూలంగా విపక్షాలు వకాల్తా పుచ్చుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ శ్రేణులు విరుచుకుపడుతుంటే, బీజేపీ నేతలకు వరుసగా బెదిరింపులు ఎదురవుతున్నాయి. బీజేపీ మహిళా నేత, ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేసిన ఏబీవీపీ మాజీ నేత నుపూర్ శర్మకు తాజాగా బెదిరింపులు ఎదురయ్యాయి. జేఎన్ యూ ఘటనపై నిన్న జరిగిన ఓ సమావేశంలో నుపూర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆమె ట్విట్టర్ ఖాతాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘‘గొంతు చించడం మానుకోండి. ఎవరో ఒకరు నీ గొంతు నరాలు తెగ్గోస్తారు. గుర్తుంచుకోండి’’ అని సదరు మెసేజ్ లో నుపూర్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో బెంబేలెత్తిపోయిన నుపూర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

  • Loading...

More Telugu News