: రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఓ ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది: బీజేపీ ఎంపీ


దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై ఉత్తర ముంబయి బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో రైతు ఆత్మహత్యలన్నీ ఆకలితోనో, పనిలేకనో జరుగుతున్నవి కాదని, అదొక ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తుంటే, మరో రాష్ట్రం రూ.7 లక్షలు, ఇంకో రాష్ట్రం రూ.8 లక్షలు ఇస్తున్నాయని అన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి మరీ నష్టపరిహారం చెల్లిస్తుంటే రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకోరు! అన్నట్టుగా ఎంపీ గోపాల్ మాట్లాడారు. రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే పలు కార్యక్రమాల ఆవిష్కరణ కోసం నేడు ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్రలోని సెహోర్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఇలాంటి సమయంలో సొంత పార్టీ ఎంపీయే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా ఉంది.

  • Loading...

More Telugu News