: సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
వరంగల్ జిల్లా మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మను ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకోనున్నారు. ఈ మేరకు జాతరకు రావాలంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ ఆయనను ఆహ్వానించారని బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్ జీఎల్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఆయన కుటుంబ సమేతంగా మేడారానికి వెళ్లి వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారని చెప్పారు. హిందూపురంలో త్వరలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలకు ఇటీవల మంత్రి చందూలాల్ ను బాలయ్య స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.