: శ్రీనగర్ కో విమానం వచ్చింది... ఏదో 'వంట' మొదలైందండోయ్: ఒమర్ అబ్దుల్లా


శ్రీనగర్ విమానాశ్రయం... రోజులో సూర్యుడు ఉన్నంతసేపే విమానాలు దిగుతాయి. చీకటి పడితే, విమానాల ల్యాండింగ్ కు అనుమతి ఉండదు. అటువంటిది రహస్యంగా ఓ విమానం వచ్చి దిగింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన మొబైల్ ఫోన్లో ఈ విమానాన్ని ట్రాక్ చేశారు. ఆపై ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ వచ్చిందని చెబుతూ ఓ వ్యంగ్య ట్వీట్ చేశారు. "షెడ్యూల్ లో లేని విమానం వీటీ జేఎస్జీ, విమానాశ్రయ కార్యకలాపాలు ముగిసిన తరువాత ల్యాండ్ అయింది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా పీడీపీ-బీజేపీ కలసి ఏదో వంట వండుతున్నాయి" అని ట్వీట్ చేశారు. ఈ విమానంలో ఎవరు వచ్చారో ఆయన వెల్లడించనప్పటికీ, ఆపై గంట వ్యవధిలోనే ముఫ్తీ ఇంటికి బీజేపీ నేత రాంమాధవ్ రావడంతో ఈ ప్రత్యేక విమానంలో ఆయనే వచ్చుంటారని తెలుస్తోంది. కాగా, విమానాశ్రయం నుంచి సీఐడీ, భద్రతాధికారులను పంపించిన తరువాత ఈ విమానం వచ్చిందని, రాంమాధవ్ రాకను రహస్యంగా ఉంచారని నేషనల్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి జునైద్ అజీమ్ మట్టు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించగా, విమానాల ప్రయాణాన్ని ట్రాక్ చేసే రాడార్ ఉండటం అద్భుతం. ఈ సారి వస్తే రాడార్ కు చిక్కకుండా రావాలని ఒమర్ అబ్దుల్లా మరో ట్వీట్ లో సలహా ఇవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News