: స్వయంగా కర్ర పట్టి రంగంలోకి దిగిన వరంగల్ కలెక్టర్ కరుణ!


వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ అధికం కావడంతో, వారిని నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ స్వయంగా కర్ర చేత పట్టారు. తోసుకు వస్తున్న భక్తులను వారిస్తూ వారిని ఓ క్రమపద్ధతిలో గద్దెల వద్దకు వెళ్లేలా చూశారు. అనంతరం మాట్లాడుతూ, లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్నారని, ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామని తెలిపారు. అధికార యంత్రాంగం మొత్తం పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు. కాగా, పోలీసులు పాటిస్తున్న ట్రాఫిక్ నిబంధనలు సత్ఫలితాలను ఇచ్చాయని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఏర్పాట్లు బాగున్నాయని, వచ్చే వాహనాలు ఒకవైపు, వెళ్లే వాహనాలు మరోవైపు ప్రయాణిస్తుండటంతో, ట్రాఫిక్ జాం కష్టాలు తప్పాయని తెలిపారు.

  • Loading...

More Telugu News