: ‘ఫ్రీడమ్ 251’ బుకింగ్స్ షురూ!... ఆర్డర్లన్నిటికీ జూన్ 30 లోగా డెలివరీ
దేశవ్యాప్తంగా పెను సంచలనాలకు తెర తీయనున్న చవక స్మార్ట్ ఫోన్ ‘ఫ్రీడమ్ 251‘ బుకింగ్స్ నేటి ఉదయం 6 గంటలకు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఫ్రీడమ్ 251.కామ్’ వెబ్ సైట్ లో ప్రారంభమైన ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 21 రాత్రి 8 గంటల దాకా కొనసాగుతాయి. వేలల్లో లభించే స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.251కే అందిస్తామంటూ దేశీయ మొబైల్ తయారీ సంస్థ ‘రింగింగ్ బెల్స్’ ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ ప్రకటించిన ఫ్రీడమ్ 251 ఫోన్ ఎలా ఉంటుందో తెలియదు కాని, పనితీరులో కాస్తంత మెరుగ్గా ఆ ఫోన్ ఉంటే, దేశీయంగానే కాక ప్రపంచవ్యాప్త మొబైల్ మార్కెట్ భారీ కుదుపునకు గురికాక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ప్రీ బుకింగ్స్ ద్వారా అందే ఆర్డర్లన్నింటికీ జూన్ 30లోగా ఫోన్లను డెలివరి చేస్తామంటూ ‘రింగింగ్ బెల్స్’ ప్రకటించింది.