: తిరుమల ఘాట్ లో కారు బీభత్సం... కాలినడక భక్తుడిపైకి దూసుకెళ్లిన వైనం


తిరుమల ఘాట్ రోడ్డులో కొద్దిసేపటి క్రితం ఓ కారు బీభత్సం సృష్టించింది. వెంకన్న దర్శనానికి కాలి నడకన కొండపైకి వెళుతున్న భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది. మోకాళ్ల పర్వతం సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి కాలినడక భక్తులపైకి దూసుకెళ్లింది. గాయపడ్డ భక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన తిరుమల భద్రతా సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News