: దూడల రాజేశ్ పై హిస్టరీ షీట్!... కాల్ మనీ కీచకుడిపై బెజవాడ పోలీసుల ఉక్కుపాదం


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ సెక్స్ రాకెట్.. ఒక్క ఏపీలోనే కాక తెలంగాణలోనూ పెద్ద చర్చకే నాంది పలికింది. ఎక్కడ వడ్డీ వేధింపులు వెలుగుచూసినా, కాల్ మనీ పేరే వినిపిస్తోంది. అత్యవసరం నేపథ్యంలో అప్పుల బాట పడుతున్న అభాగ్యులను వారి అవసరాలను ఆసరా చేసుకుని వడ్డీ వ్యాపారులు తమదైన రీతిలో వేధించడం, ఆ తర్వాత వారిని వ్యభిచార కూపంలోకి లాగడంపై ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపేందుకే నిర్ణయించుకుంది. ఆ మేరకు పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కాల్ మనీ పేరిట మహిళలను వేధింపులకు గురి చేసిన కాల్ మనీ కీచకుల్లో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కీలక నిందితుడైన దూడల రాజేశ్ పై బెజవాడ పోలీసులు హిస్టరీ షీట్ ఓపెన్ చేశారు. ఈ మేరకు నిన్న బెజవాడ పోలీసులు కీలక అడుగు వేశారు.

  • Loading...

More Telugu News