: షీ టీమ్ కు చిక్కిన లాయర్...నిర్భయ చట్టం కింద కేసు


హైదరాబాదులో షీ టీమ్స్ ఒక వేధింపుల లాయర్ కు చెక్ చెప్పాయి. జనవరిలో గచ్చిబౌలిలో జరిగిన ఐఐఎఫ్ఏ ఉత్సవానికి బర్కత్ పురాకు చెందిన ఎం.అభిషేక్ (38) అనే న్యాయవాది హాజరయ్యాడు. అదే వేడుకలో ఢిల్లీకి చెందిన ఒక మహిళ కూడా పాల్గొంది. ఈ ఉత్సవాల్లో తాము మీడియా ప్రతినిధులమని ఆమెను అభిషేక్ పరిచయం చేసుకున్నాడు. తమతో స్నేహం చేయాలని కోరాడు. ఆమె వారితో స్నేహానికి అంగీకరించలేదు. దీంతో ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని, ఆమెకు మెసేజ్ లు పెట్టి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తన స్నేహితులతో అభిషేక్ కు హెచ్చరికలు పంపింది. అయినప్పటికీ అభిషేక్ ఆగడాలు ఆగకపోవడంతో ఆమె షీ టీమ్స్ సాయం కోరింది. దీంతో రంగ ప్రవేశం చేసిన షీ టీమ్స్ అభిషేక్ ను అరెస్టు చేసి, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News