: కాకినాడలో ముద్రగడను కలిసిన మంచు విష్ణు
తూర్పుగోదావరికి చెందిన కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కలుసుకున్నాడు. కాకినాడలోని ముద్రగడ కల్యాణ మండపంలో జరిగిన మోహన్ బాబు అభిమాని కొడుకు వివాహానికి విష్ణు హాజరయ్యాడు. ఇదే వివాహానికి ముద్రగడ కూడా హాజరయ్యారు. దీంతో మంచు విష్ణు, ముద్రగడతో పది నిమిషాల పాటు సమావేశమయ్యాడు. తన తండ్రి స్నేహితుడైన ముద్రగడతో భేటీలో ఎలాంటి ప్రత్యేకత లేదని విష్ణు చెప్పాడు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని తెలిపాడు.