: స్నేహం పేరుతో మోసం ... ఆపై 'సారీ' అంటూ మెసేజ్!
పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ సాధారణం. భారత దేశంలో మ్యాట్రిమొనీ సైట్లలా విదేశాల్లో డేటింగ్ కోసం వెబ్ సైట్లు ఉన్నాయి. బ్రిటన్ లో పేరు మోసిన డేటింగ్ వెబ్ సైట్ మ్యాచ్.కామ్ ద్వారా డెర్బీ ప్రాంతానికి చెందిన జాసన్ లారెన్స్ (50) అనే వ్యక్తి వేర్వేరు పేర్లతో నకిలీ అకౌంట్లు తెరిచాడు. ఈ వెబ్ సైట్ ద్వారా పరిచయమైన వారిని ఫోన్ చేయాలని, లేదా ప్రైవేట్ మెయిల్ లో ఛాట్ చేయాలని కోరేవాడు. అనంతరం వారిని ఇంటికి ఆహ్వానించి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ రికార్డులు మ్యాచ్.కామ్ లో లేకుండా జాగ్రత్తపడేవాడు. ఇలా అత్యాచారానికి పాల్పడ్డ అనంతరం సారీ అంటూ మెసేజ్ లు పెట్టేవాడు. ఇతని పాపం పడడంతో డెర్బీ క్రౌన్ కోర్టులో విచారణ జరుగుతోంది. అతని క్రిమినల్ బ్రెయిన్ ను ప్రాసిక్యూటర్ షాన్ స్మిత్ న్యాయస్థానానికి వెల్లడించారు.