: ఎన్ఎంయూ నుంచి మహమూద్ బహిష్కరణ


ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయూ నుంచి ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ ను ఆ కార్మిక సంస్థ బహిష్కరించింది. ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తానంటూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల నుంచి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడం, పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో హైదరాబాదులో సమావేశమైన ఎన్ఎంయూ కార్యవర్గం మహమూద్ ను కార్మిక సంఘం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, అక్రమ వసూళ్ల కేసులో మహమూద్ సహా 8 మందిని కోదాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News