: నల్గొండ ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం


నల్గొండ జిల్లాలో ఘరానామోసం వెలుగు చూసింది. నల్గొండ జిల్లా ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల నుంచి ఎన్ఎంయూ కార్మిక సంఘ నేత సయ్యద్ మహమూద్ 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులు, ఉద్యోగాల పేరిట మోసం జరిగిన మాట వాస్తవమేనని గుర్తించారు. దీంతో నల్గొండ జిల్లా కోదాడ పోలీసులు సయ్యద్ మొహమూద్ సహా ఈ ఘరానా మోసంలో భాగమైన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుల నుంచి నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు, సర్టిఫికేట్లు, 16 లక్షల రూపాయల నగదు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News