: గాయాలు మామూలే...ఆందోళన వద్దు: హృతిక్ రోషన్
సినిమా షూటింగుల్లో గాయాలు మామూలేనని అభిమానులు ఆందోళన చెందవద్దని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తెలిపాడు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందుతున్న మొహాంజోదారో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో గతంలో ఒకసారి తీవ్రంగా గాయపడ్డ హృతిక్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డాడు. దీంతో వైద్యులు రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపాడు. సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన నీరజ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, ఈ సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నాడు. తాను భయం గురించి మాట్లాడనని చెప్పిన హృతిక్, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపాడు. ఈ సినిమాలో మరోపాత్రలో నటించిన షబానా అజ్మీకి సెల్యూట్ చెప్పాడు.