: కేశవరెడ్డి యాజమాన్యం ఆస్తుల అటాచ్ మెంట్ కు ఆదేశాలు
కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏపీ హోం శాఖ ఈరోజు ఆదేశించింది. రూ.24.50 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా, కర్నూల్ జిల్లా నంద్యాల లోని బాలాజీనగర్లో నివాసం ఉంటున్న కేశవరెడ్డికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు అవసరమైన పెట్టుబడుల నిమిత్తం విద్యార్థుల తల్లిదండ్రులు, వ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించారు. అధిక వడ్డీల ఆశ చూపి తమ డబ్బులు తీసుకున్నారని వారు ఫిర్యాదు చేయడంతో కేశవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.