: ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం


ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన మంత్రులు హాజరయ్యారు. కాగా, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశాల్లో హెచ్ సీయూ, జేఎన్యూ ఆందోళనల గురించి, మత అసహనం వంటి అంశాలపైన చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉండడంతో దానిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేంద్ర కేబినెట్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో విపక్షాల సహాయంతో జీఎస్టీ, వస్తుసేవల బిల్లు వంటి కీలకమైన బిల్లులను రాజ్యసభలో గట్టెక్కించుకునేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News