: గర్ల్ ఫ్రెండ్స్ కోసం దోపిడీలు చేశాడట!


మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో పలు దోపిడీలకు పాల్పడిన దొంగను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ ప్రారంభించిన పోలీసులు ఇన్ని దోపిడీలకు ఎందుకు పాల్పడ్డావు? అని అడిగితే...'గర్ల్ ఫ్రెండ్స్ ను సంతోషపెట్టేందుకు' అని సమాధానమిచ్చి పోలీసులను అవాక్కయ్యేలా చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మహారాష్ట్రలోని బల్దాన జిల్లాకు చెందిన ఓం ప్రకాశ్ రంగనాథ్ ఖాంద్వే (26) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసైన ఓం ప్రకాశ్ పలు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి 17 సెల్ ఫోన్లు, 4.5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ మొదలుపెట్టగా, తన ఏడుగురు గర్ల్ ఫ్రెండ్స్ ను సంతోషంగా ఉంచేందుకు దొంగతనాల బాటపట్టినట్టు వెల్లడించాడు. అతనితో బాటు, దొంగిలించిన ఈ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News