: కన్నయ్యపై దాడి జరగలేదు: పోలీసు కమిషనర్ బస్సీ


జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పై ఎవరూ దాడి చేయలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ పేర్కొన్నారు. కన్నయ్యను పాటియాలా కోర్టుకు తరలిస్తుండగా పరిస్థితి కొంచెం అదుపు తప్పిందని.. ఆ సయమంలో అతనిపై ఎవరూ దాడి చేయలేదన్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో కన్నయ్య తన చెప్పులు పోగొట్టుకున్నాడని బస్సీ పేర్కొన్నారు. ఈ వివాదంలో జేఎన్ యూ విద్యార్థులే కాకుండా బయటి వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఈ కోణంలో విచారణ కొనసాగిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News