: కలిస్ లా ఎదగాలని ఉంది: హార్డిక్ పాండ్య


సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ లా ఎదగాలని ఉందని టీమిండియా ఆటగాడు హార్డిక్ పాండ్య తెలిపాడు. సౌతాఫ్రికాకు కలిస్ ఎలా కీలకంగా మారాడో తాను కూడా అలాగే మారాలని భావిస్తున్నానని పాండ్య చెప్పాడు. పేస్ బౌలర్ గా జట్టులో అడుగుపెట్టిన కలిస్ బ్యాట్స్ మన్ గా గుర్తింపు తెచ్చుకుని, సఫారీ జట్టు ఓపెనర్ గా మారాడని, మెరుపు ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడని, తనకు కూడా అలాంటి ఆల్ రౌండర్ అన్న గుర్తింపు కావాలని, టీమిండియా ఆల్ రౌండర్ గా విశేషమైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాడు. అందుకే జట్టు అవసరాల మేరకు రాణించి సత్తా చాటాలని భావిస్తున్నానని పాండ్య తెలిపాడు.

  • Loading...

More Telugu News