: కన్నయ్య కుమార్ కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు: సుప్రీంకు న్యాయవాదుల నివేదిక


దేశద్రోహం కేసులో అరెస్టు అయిన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సీనియర్ న్యాయవాదుల కమిటీ సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. కన్నయ్య కుమార్ ను పటియాలా హౌస్ కోర్టు రెండు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సార్లు కన్నయ్య కుమార్ పై లాయర్లు దాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూడడం తప్పించి ఏమీ చేయలేదు. దీంతో నలుగురు సీనియర్ న్యాయవాదులతో ఏర్పాటు చేసిన కమిటీని సుప్రీంకోర్టు పటియాలా హౌస్ కోర్టుకు పంపింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై ఈ నెల 19న పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఢిల్లీ కమిషనర్ ను ఆదేశించింది. అలాగే కన్నయ్య కుమార్ కేసు విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పటియాలా హౌస్ కోర్టును ఖాళీ చేయించాలని, భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఢిల్లీ కమిషనర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News