: గన్ తో బెదిరిస్తే...'స్వీట్' ఎటాక్ ఇచ్చింది!


తుపాకీతో బెదరిస్తే ఎవరైనా ఏం చేస్తారు? సాధారణంగా తుపాకీ ఉన్నవ్యక్తి అడిగినది ఇచ్చేస్తారు. కానీ స్వీడన్ లోని మాల్మో పట్టణంలో జైనాబ్ సలీం అనే యువతి మాత్రం చేతికి అందిన స్వీట్లతో ఎదురుదాడికి దిగింది. ఆమె దాడిని తట్టుకోలేకపోయిన దోపిడీ దారు తుపాకీ చేతబట్టి పరుగులంకించుకున్నాడు. అంతటితో ఆగని ఆమె దగ్గర్లో ఉన్న సోదరుడికి సమాచారం ఇచ్చి అతనిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఐదు సార్లు దోపిడీ దొంగల బారినపడ్డానని చెప్పింది. ఒకడు గొడ్డలితో బెదిరిస్తే, మరొకడు కత్తితో బెదిరించాడని, ఈసారి తుపాకీతో బెదిరించడంతో అప్రయత్నంగా ఎదురుదాడికి దిగానని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News