: జవాన్ శవపేటికపైనా ‘అమ్మ’ రాజకీయం!


జవాన్ శవపేటికపైనా ‘అమ్మ’ రాజకీయం నడిచింది. సియాచిన్ లో అమరుడైన జవాన్ గణేషన్ స్వస్థలం తమిళనాడులోని మధురై. నిన్న అంత్యక్రియలు నిర్వహిస్తున్న సందర్భంలో ‘అమ్మ’ రాజకీయం వెలుగుచూసింది. జవాన్ అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్ వీర రాఘవరావుతో కలిసి తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జవాన్ గణేషన్ తల్లికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్ ను అందజేశారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత ఫొటోను గణేషన్ శవపేటికపై ఉంచిన మంత్రి.. ఈ సాయం అందించింది అమ్మే నంటూ గణేషన్ తల్లికి సైగ చేశారు. కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఆమె ఆ ఫొటోకు నమస్కారం చేసింది. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది చివర్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News