: ఫుట్ బాల్ స్టార్ నెయ్ మార్ ఆస్తుల జప్తుకు ఆదేశం


కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాల్లో పన్ను ఎగవేతకు పాల్పడిన కేసులో బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ నెయ్ మార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు రూ.110 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు తేలడంతో... అతడి ఆస్తులను జప్తు చేయాలని సావోపాలో ఫెడరల్ కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అతడి యాట్, జెట్ లతో పాటు మొత్తం రూ.50 మిలియన్ డాలర్ల (రూ.342 కోట్లు) ఆస్తులను జప్తు చేయాలని తెలిపింది. ఉత్తర్వులు అందుకున్న వెంటనే ఫెడరల్ టాక్స్ అధికారులు ఆస్తుల జప్తుకు చర్యలు చేపట్టారు. ఇదిలాఉంటే బకాయిపడిన మొత్తాన్ని గనుక తిరిగి చెల్లిస్తే నెయ్ మర్ జైలుకు వెళ్లే అవకాశం ఉండదని బ్రెజిల్ ఫెడరల్ టాక్స్ ఏజెన్సీ ఆడిటర్ తెలిపారు.

  • Loading...

More Telugu News