: హాలీవుడ్ లో విలన్ గా ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి ఒకే ఒక్క సీరియల్ తో పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్న ప్రియాంకా చోప్రా మరో క్రేజీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. డ్వెన్ జాన్సన్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. 1990లో స్టార్ వరల్డ్ లో సీరియల్ గా అలరించిన 'బేవాచ్' కథ ఈ చిత్రానికి ఆధారం. దీనికి కూడా 'బేవాచ్' అనే టైటిలే నిర్ణయించారు. ఈ విషయాన్ని నటుడు డ్వెన్ జాన్సన్ తెలుపుతూ, ప్రియాంకతో కలసి వున్న వీడియోని ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో అద్భుతమైన భారతీయ అగ్రనటి ప్రియాంకా చోప్రా విలన్ పాత్ర పోషించనుందని తెలిపాడు. దీపికా పడుకునే నటిస్తున్న 'ట్రిపుల్ ఎక్స్' సినిమాలో కూడా డ్వెన్ జాన్సన్ ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.