: మరో రికార్డు దిశగా దుబాయ్ అడుగులు
మరో రికార్డు దిశగా దుబాయ్ అడుగులు వేస్తోంది. మానవ నిర్మిత ద్వీపాలు, అద్భుతమైన కట్టడాలతో అబ్బురపరిచే దుబాయ్ ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. 2014లోనే ఈ భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. 2020లో దుబాయ్ లో ఎక్స్ పోకి ఆతిథ్యమివ్వనుంది. అప్పటికల్లా 25 శాతం నిర్మాణం పూర్తి చేయాలని దుబాయ్ హోల్డింగ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ మాల్స్, ధీమ్ పార్క్, 20 వేల గదులు కలిగిన 100 హోటల్స్ ను నిర్మించనున్నారు. ఈ షాపింగ్ మాల్ నిర్మాణానికి 22 బిలియన్ డాలర్లు (1.51 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయితే దుబాయ్ కి మరింత ఆదాయం రానుందని పేర్కొంటున్నారు.