: ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఏపీలో గిరిజన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ


ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన మండలాల్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో ఖాళీగా ఉన్న 309 పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు గిరిజనశాఖకు అనుమతిస్తున్నట్లు ఈ ఉత్తర్వులో పేర్కొంది. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో కూనవరం, చింతూరు, నెల్లిపాక, విఆర్ పురం, కుక్కునూరు తదితర మండలాలు ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగమయ్యాయి.

  • Loading...

More Telugu News