: మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని సుమొటోగా స్వీకరించిన ఎన్ హెచ్ఆర్సీ
ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయి చేసుకున్న దాడుల్లో పలువురు జర్నలిస్టులకు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్సీ) దీనిని సుమొటోగా విచారణకు స్వీకరించింది. జరిగిన ఘటనపై జాతీయ హోం కార్యదర్శి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది.