: పటియాలా హౌస్ కోర్టులో రెండు వర్గాలుగా విడిపోయిన లాయర్లు...నినాదాలు


ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ నాయకుడు కన్హయ్య కుమార్ ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన సందర్భంగా న్యాయవాదులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం శృతిమించడంతో ఘర్షణగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన లాయర్లు పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురు జర్నలిస్టులు, విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించింది. కాగా, నిన్న కూడా కన్హయ్య కుమార్ ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన సందర్భంగా దాడులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో న్యాయస్థానం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News