: అమీర్ ఖాన్ ని అంబాసిడర్ గా నియమించలేదు: మహారాష్ట్ర సర్కార్


ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తమ ప్రభుత్వం నియమించలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయుక్త్ శివర్ అభియాన్ పథకానికి అమీర్ ని అంబాసిడర్ గా నియమించారన్న వార్తలను నమ్మవద్దని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కాగా, దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ అమీర్ ఖాన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇన్ క్రెడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమీర్ ని కేంద్రం ఆ పదవి నుంచి తొలగించింది.

  • Loading...

More Telugu News