: నటుడి ఆత్మహత్య, బుల్లితెర నటి ప్రలిప్త అరెస్ట్


ఒరియాలో పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ పేరు తెచ్చుకున్న నటి ప్రలిప్త అలియాస్ జెస్సీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సహ నటుడు రంజిత్ పట్నాయక్ ను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిందన్న అనుమానంతో ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గతవారంలో ఏర్పాటైన ఓ మ్యూజిక్ షోలో ప్రలిప్తతో పాటు చందన్ అనే మరో నటుడు పాల్గొనాల్సి వుంది. ఈ కార్యక్రమానికి చందన్ రాకపోవడంతో, ఆ షోకు ఆహ్వానం లేకపోయినా వచ్చిన రంజిత్ కు అవకాశం లభించింది. ఆపై వెనుదిరిగి వెళుతుండగా, రంజిత్ టాలెంట్ ను ప్రలిప్త అవహేళన చేసింది. వీరిద్దరి మధ్యా అప్పటికే ఆర్థిక తగాదాలు ఉన్నాయి. కారులో వాగ్వాదం పెద్దదికాగా, మనస్తాపానికి గురైన రంజిత్, కారును వంతెనపై ఆపించి, పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణ జరుపుతున్నామని, ప్రలిప్తతో పాటు సదరు ఈవెంట్ నిర్వహించిన వారికి, కారు డ్రైవర్ కూ నిజ నిర్థారణ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News