: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు... విశాఖ మెరైన్ సీఐ నివాసంలో ఏసీబీ తనిఖీలు


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశాఖకు చెందిన పూడిమడక మెరైన్ సీఐ హుస్సేన్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని ఓల్డ్ సీబీఐ డౌన్ లోని ఆయన నివాసంలో సోదాలు జరుపుతున్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రాజాం, పెందుర్తి, బెంగళూరులోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుత సోదాల్లో రూ.2 కోట్లకు పైగా అక్రమాస్తులను అధికారులు గుర్తించినట్టు సమాచారం. సీఐ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారని, విశాఖ బీచ్ రోడ్డుపై విల్లా కూడా ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. గతంలో సిమ్స్ స్కాంలో హుస్సేన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

  • Loading...

More Telugu News