: రాజధానికి సహకరించకుండా కొంతమంది లేనిపోని విమర్శలు చేస్తున్నారు: చంద్రబాబు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. వెలగపూడిలో ఈ రోజు తాత్కాలిక సచివాలయం శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడుతూ, తాను రాష్ట్రం కోసం, రాజధాని నిర్మాణం కోసం 24 గంటలూ కష్టపడుతుంటే కొంతమంది మాత్రం లేనిపోని విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై పరోక్షంగా స్పందించారు. రాజధాని నిర్మాణానికి ఒక్క సలహా కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. 'మీరు ఎలాంటి సూచనలు ఇవ్వకున్నా పర్వాలేదుగానీ.... ఏమీ మాట్లాడకుండా ఉంటే చాలా మంచిదని' ప్రతిపక్షాలకు బాబు హితవు పలికారు. విద్వేషాలను రెచ్చగొట్టకుండా మంచిగా ఉంటే రాష్ట్రానికంతా మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గుండాయిజం, రౌడీయిజాన్ని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ సరిగా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఎంతోమంది రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూములు ఇవ్వడం సంతోషమని, వారికి ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఈ మధ్యే వెలగపూడికి చెందిన ఓ వృద్ధురాలు రాజధాని నిర్మాణానికి విరాళంగా రూ.కోటి ఇచ్చిందని, రాష్ట్రం కోసం తాను పడుతున్న శ్రమ, తపన చూసే ఇస్తున్నట్టు ఆవిడ చెప్పిందని ప్రస్తావించారు. కాబట్టి రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ముందుకురావాలని బాబు కోరారు.

  • Loading...

More Telugu News