: దుస్సాహసం, నమ్మించి వెన్నుపోటే... ఇప్పుడెవరికి చెప్పుకోను?: కార్గిల్ వార్ పై నవాజ్ షరీఫ్
ఓ వైపు ఇండియాతో శాంతి చర్చలు సాఫీగా సాగుతున్న వేళ, పాక్ సైన్యం కార్గిల్ ను ఆక్రమించాలని కదలడం దుస్సాహసమేనని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించినట్టు 'ఇండియా టుడే' ప్రకటించింది. పాకిస్థానీ దళాలు 1999లో అసాధ్యమైన విజయం కోసం కదిలాయని ఆయన అన్నారు. "పాక్ దుస్సాహసంతో తనను నమ్మించి వెన్నుపోటు పొడిచిందని ఆనాడు వాజ్ పేయి నాతో అన్నారు. లాహోర్ లో శాంతి చర్చలు జరుగుతున్న వేళ కార్గిల్ ఆక్రమణకు యత్నం జరిగింది. వాజ్ పేయి చెప్పింది కరెక్టే. ఆయన్ను మోసం చేశాం. నేనూ అదే అనుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయగలను?" అని నవాజ్ వ్యాఖ్యానించారు. ఒక్క సరిహద్దుల విషయంలో తప్ప భారత్, పాక్ దేశాలు, ప్రజల మధ్య ఎంతో సారూప్యత ఉందని ఆయన అన్నారు.