: అమరావతిలో నూతన అధ్యాయానానికి శ్రీకారం చుట్టాం: చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతన అధ్యాయానానికి శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం పరిపాలన సౌలభ్యం కోసమే తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి కాకుండా ఇక్కడి నుంచే పరిపాలన చేయాలన్న ఆలోచనతోనే భవన నిర్మాణాలు చేస్తున్నామన్నారు. వెలగపూడిలో 45.129 ఎకరాల్లో శంకుస్థాపన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో శంకుస్థాపన చేసింది తాత్కాలిక భవనం అయినప్పటికీ ఇవి శాశ్వతమైనవని స్పష్టం చేశారు. ఇక్కడ నిర్మించబోయే భవనాలు చరిత్రలో నిలిచిపోతాయని, భవిష్యత్తు తరాలవారు వాటి గురించి ప్రముఖంగా చెప్పుకుంటారని సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ఇక్కడి భవనాలే నాంది అవుతాయని చెప్పారు. కాబట్టి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.