: రూ. 500 కాదు రూ. 251 మాత్రమే... 4 అంగుళాల తెర, 1 జీబీ రామ్, 8 జీబీ మెమొరీ... భారత్ సాధించిన అద్భుత ఘనత ఇది!


రూ. 500 కన్నా తక్కువ ధరలో ఓ స్మార్ట్ ఫోన్ ను నేడు భారత మార్కెట్లోకి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ గురించిన మరింత సమాచారం వెలువడింది. దీని ధర రూ. 500 కాదు. రూ. 251 మాత్రమేనట. ఇక ఈ ఫోన్ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్. దీని స్పెసిఫికేషన్స్ గురించిన లీకులూ బయటకు వచ్చాయి. 4 అంగుళాల టచ్ స్క్రీన్, 1 జిబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3.2 ఎంపీ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటాయని తెలుస్తోంది. వాస్తవానికి 8 జీబీ మెమొరీ కార్డు లేదా 1450 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా రూ. 251 ధరలో లభ్యం కావు. అటువంటిది ఈ ధరలో ఇన్ని సౌకర్యాలతో ఫోన్ నిజంగా భారత్ 'మేకిన్ ఇండియా' సాధించిన ఘనతే. కాగా, దేశవాళీ సంస్థ రింగింగ్ బెల్స్ 'ఫ్రీడమ్ 251' పేరిట తయారు చేసిన ఈ ఫోన్ ను నేడు సాయంత్రం ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు.

  • Loading...

More Telugu News