: శంకుస్థాపనలతో... ఇద్దరు చంద్రులు బిజీబిజీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు నేటి ఉదయం శంకుస్థాపనలతో తమ దినచర్యను ప్రారంభించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం హోదాలో శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఎంపిక చేసిన స్థలంలో వేద పండితులు నిర్దేశించిన సమయానికే ఆయన శంకుస్థాపన చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ కూడా నేటి ఉదయం రాజ్ భవన్ ఉద్యోగుల నివాస భవనాలకు శంకుస్థాపన చేశారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా పాలుపంచుకున్నారు.